తాగు జలాలకై జగడం

తాగు జలాలకై జగడం
అధికారుల తీరుపై సభ ఆగ్రహం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
పల్లెలకు మిషన్ భగీరథ నీరందడం లేదని తాగు జాలాలకై తండ్లాట షురూ అయింది.అధికారుల తీరును నిరసిస్తూ మండల సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిర్యాలగూడ మండలంలో మిషన్ భగీరథ తాగు నీరందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సోమవారం మిర్యాలగూడ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు నూకల సరళ హనుమంతరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిప్పన విజయసింహరెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో శ్రీనివాస్ నగర్ సర్పంచ్ బి.వెంకటరమణ చౌదరి, జంకు తండా, జాలుబాయ్ తండా సర్పంచ్లు రవీందర్ నాయక్, ఎంపిటిసి గురవయ్య మిషన్ భగీరథ నీరు గ్రామాలకు సరఫరా కావడం లేదని ఆరోపించారు. వేసవి కాలం ఇబ్బందులు లేకుండా చూడాలని సమావేశల్లో ఎన్ని సార్లు చెప్పిన ఫలితం లేదని విమర్శించారు. ఒక దశలో తాము అధికార పక్షంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా అని విజయసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వేసవి అయిపోతున్న నీటి ఇబ్బందులు తొలగించకపోవడం అధికారుల నిర్లక్ష్యనికి నిదర్శనం అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మెటీరియల్ కొనుగోలు చేసి నేరండించే చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని బి. అన్నారం సర్పంచ్ వీరారెడ్డి ఆరోపించారు. వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా చేసే మూడు ట్రాన్స్ఫార్మర్లు కాలి పోయిన పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తగు చర్యలు తీసుకుంటామని విద్యుత్ సబ్ ఇంజనీర్ అన్నారు. మన ఊరు-మన బడి కింద 15 పాఠశాలల మరమ్మతులు జరుగుతున్నాయని ఎంఇఓ బాలాజీనాయక్ పేర్కొనగా త్వరగా పూర్తి చేయాలని విజయసింహారెడ్డి అన్నారు. సమావేశంలో ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, తహసీల్దార్ అనిల్ కుమార్, ఐసిడిఎస్ పిఓ ఆర్.మమత, ఎంపిఓ టి.వీరారెడ్డి, ఎఇఇలు ఆదినారాయణ, మౌనిక, దీక్షిత, బిసిడబ్ల్యూ తరఫున నుశ్రత్ అలీ, ఎస్సి శాఖ తరపున జానిమియా, యంపిటిసిలు, సర్పంచులు మండల స్థాయి అధికారులు, కార్యాలయ సూపరింటెండెంట్ పి. కరుణాకర్, ఎస్ఎ భరద్వాజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking