టిఆర్ఇఏఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా రజనీకాంత్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా కోక నీలకంఠ రజనీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిల్లెల శ్రీకాంత్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. అరుణోదయ ఇన్ ఫ్రా డెవలపర్స్ డైరక్టర్ గా సేవలందిoస్తుండ్రు.

కొలనుపాక, ఆలేరులలో గేటెడు కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్, నాగోల్ లోనూ గేటేడు కమ్యూనిటీ ఆపార్ట్ మెంట్స్, విల్లాలు, ఇండిపెండెంట్ ఇళ్ల ప్రాజెక్ట్స్ ను విక్రయిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో విశిష్ఠ అనుభవం గడించిన రజనీకాంత్ అటు ఏజంట్లు, ఇటు మేనేజ్ మెంట్ సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. రియల్ రంగంలోకి నూతనంగా ప్రవేశించే వారికి మెళుకువలు, రియల్ రంగం విశిష్టత తదితర అంశాలపై తర్పీదు నిచ్చి ఏజంట్ల మనుగడకు అవసరమైన కృషి చేస్తారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ రియల్ రంగంలో ఏజంట్లకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఇఏఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా రజనీకాంత్ నియామకపు పట్ల తెలంగాణ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సంక్షేమ సంఘం నేతలు జనప రెడ్డి రవీందర్ హర్షం వ్యక్తం చేశారు.