మహిళల భద్రత, సంక్షేమమే
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
*రూ.25.68కోట్ల రుణాల పంపిణి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మహిళల భద్రత, ఆర్ధికాభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్ శ్రీమన్నారాయణ గార్డెన్స్ లో మహిళాసంక్షేమదినోత్సవంలో భాస్కర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మహిళల రక్షణ, భద్రత కొరకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

మహిళల రక్షణ, భద్రత మరియు నైపుణ్యాభివృద్ధి కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా పలు పధకాలను అమలు చేయడం జరుగుతుందని బాధిత మహిళలకు 24 గంటల సమీకృత సహాయ సేవలకై సఖి కేంద్రాలను, మహిళా ప్రయాణికుల భద్రత, మహిళల ఉపాధికై షిటాక్సీ పధకం ద్వారా మహిళా డ్రైవర్లకు టాక్సీలు అందజేసామని, అదే విధంగా ప్రతి జిల్లా కేంద్రంలో లైంగిక హింసకు గురైన పిల్లలు, మహిళలకు అవసర సేవలను అందించడం కోసం భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందిన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు సమర్థవంతంగా అందించేందుకు అంగన్వాడీ సిబ్బందికి అందించే గౌరవ వేతనాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 300% పెంచారన్నారు. అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అంగన్వాడీ టీచర్ల గౌరవ వేతనం నెలకు రూ.4,200 ఉంటె దానిని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.13,650 రూపాయలుగా పెంచిందని , అలాగే అంగన్వాడీ హెల్పర్ కు, మినీ అంగన్వాడీ టీచర్ కు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.7,800 రూపాయల గౌరవ వేతనాన్ని అందిస్తుందని, అంగన్వాడీ కార్యకర్తను అంగన్వాడీ టీచర్ గా గౌరవప్రద స్థాయికి చేర్చడం జరిగిందన్నారు. అనాథలు, నిరాదరణకు గురైన పిల్లలను సంరక్షించడానికి రాష్ట్రంలో 17 శిశు గృహాలు ఏర్పాటు చేయబడినవని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సిఎం కె.చంద్రశేఖర్ రావు గర్భిణులు, బాలింతలు, చిన్నారులలో పౌష్టికాహార లోపం మరియు రక్తహీనత నివారణకు గాను 2015 జనవరి 1న ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజు ఆకు కూరలు, గుడ్డు, పాలతో ఒక సంపూర్ణ భోజనాన్ని అందజేస్తుందని తెలిపారు. అనంతరం మహిళా ఉద్యోగినులు, ఆధికారులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు, అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని 220 స్వయం సహాయక సంఘాలకు రూ.24.56కోట్ల రుణాలు, 237 సమభావన సంఘాలకు రూ. 1.12 కోట్ల స్త్రీ నిధి రుణాల చెక్కులను పంపిణి చేశారు. కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్.మమత నిర్వహించి, ప్రాజెక్ట్ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహరెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబునాయక్, ఎంపిపిలు నూకల సరళ హనుమంతరెడ్డి, ధీరావత్ నందిని రవితేజ, ధనవాత్ బాలాజీ నాయక్, పోకల శ్రీవిద్య రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్రా విష్ణు, ఆర్డిఓ బి.చెన్నయ్య, జడ్పీటీసీలు అంగోతు లలిత హతిరాం నాయక్, కుర్రా సేవ్యనాయక్, జడ్పి కో ఆప్షన్ సభ్యులు మోహ్సిన్అలీ, జొన్నలగడ్డ రంగారెడ్డి, పెద్ది శ్రీనివాస్ గౌడ్, పాక్స్ చైర్మన్ వి.రామకృష్ణ, ఎంపీడిఓలు గార్లపాటి జ్యోతిలక్ష్మి, జితేందర్రెడ్డి, మాసూద్ షరీఫ్, ఎ.దేవిక, మున్సిపల్ కమీషనర్ రవీందర్ సాగర్, కౌన్సిలర్లు చైతన్య, ఇలియాజ్, రమేష్, కమిషనర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.