పల్లె ప్రగతితోనే పల్లెల అభివృద్ధి
అక్షిత న్యూస్, మాడ్గులపల్లి :
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మాడుగులపల్లి మండల పరిధిలోని గ్రామాలలో ఘనంగా పల్లె ప్రగతి వేడుకలను సర్పంచ్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసి గ్రామపంచాయతీ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం సర్పంచ్ ల చేత జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.అనంతరం గ్రామ సభలు నిర్వహించడం గ్రామాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రజలకు వివరించారు. సర్పంచులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నాయని, దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా ఉందని అన్నారు. గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రం అందజేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి తాసిల్దార్ శివకుమార్, సర్పంచులు, కార్యదర్శులు ,గ్రామాల పాలకవర్గం,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, ఏఎన్ఎంలు,అంగన్వాడీ టీచర్లు,,ఆశా వర్కర్లు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.