ప్రగతి పథం ‘స్తంభాద్రి’ రథం

ప్రగతి పథం ‘స్తంభాద్రి’ రథం

-సుడాతో మారిన అభివృద్ధి రూపురేఖలు

-సుడా ఛైర్మన్ గా బచ్చు విజయ్ కుమార్ దిగ్విజయంగా పూర్తెన మూడేళ్ళ ప్రగతి 

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం నలుచెరుగులా ప్రగతి ముద్రలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయి. ఏ మారుమూల పల్లెకు వెళ్లినా స్వచ్ఛ మల్లెలు విరబూస్తున్నాయి. ప్రగతిలో పల్లె, పట్నాల రూపురేఖలు మారాయి. ప్రతి గ్రామంలో రైతు వేదికలు, వన నర్సరీలు, పల్లె, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రగతి చక్రంలోని మొదటి విభాగం సుడా. నాడు మురికికూపంతో కునారిల్లిన ఖమ్మం తెలంగాణకే రోల్‌మాడల్‌గా నిలిచింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక ప్రణాళిక, పట్టుదలతో స్తంభాద్రి నగరంగా తీర్చిదిద్దారు.

తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం నగరం ఒకటి. నగర అభివృద్ధి నమూనాను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు నగర స్వరూపాన్నే మార్చాయి. ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవ, కృషితో నగరాభివృద్ధికి దండిగా నిధులు విడుదలవుతున్నాయి. ఆయన కృషితోనే ఏర్పాటైనా సుడా నేటికి మూడేళ్ల పూర్తి చేసుకుంది.

ఖమ్మం సుడా ఓ వైపు ఆదాయాన్ని సమకూర్చుకుంటూ మరో వైపు దశలవారీగా మంజూరవుతున్న నిధుల ద్వారా అభివృద్ధి పుంతలు తొక్కుతున్నది. మొదటి పాలకవర్గం ఏర్పడి మూడేళ్లు పూర్తై ప్రగతి పథంలో సాగుతున్నది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని సుడా పాలకవర్గ సభ్యులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అభివృద్ధిని ఆకాంక్షించి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ వెనువెంటనే కార్యరూపం దాల్చుతుండడం శుభపరిణామం కాగా, పెద్ద ఎత్తున నిధుల మంజూరు పట్ల ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర పుటల్లో నిలిచేలా ప్రగతి తిలకం దిద్దారు. నగరం నలుచెరగులా అభివృద్ధి ముద్ర వేశారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో రూ.వేల కోట్ల నిధులు మంజూరు చేయించి ఖమ్మం నగర రూపురేఖలు మార్చి వేశారు. చరిత్ర పుటల్లో నిలిచేలా ప్రగతి తిలకం దిద్దారు. నగరం నలుచెరగులా అభివృద్ధి ముద్ర వేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో రూ.వేల కోట్ల నిధులు మంజూరు చేయించి ఖమ్మం నగర రూపురేఖలు మార్చి వేశారు. ఖమ్మం నగరం దేశంలోని ప్రధాన నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. తద్వారా అన్ని రంగాల్లో పురోగతి సాధించడంతోపాటు ఉపాధి కేంద్రంగా మారింది.

రాష్ట్రంలోని పట్టణాలతో పాటు వాటి సమీప గ్రామాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యే నాటికి తెలంగాణలో కేవలం రెండు పట్టణాభివృద్ధి సంస్థలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 10కి చేరింది. దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందున్నది. రానున్న కొన్ని సంవత్సరాల్లో సగం మంది తెలంగాణ ప్రజలు పట్టణాల్లోనే ఉంటారన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 8 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాకు స్తంభాధ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఖమ్మం కార్పొరేషన్ తో పాటు సమీప 46 గ్రామాల పరిధిలోకి తీసుకొని అక్టోబర్ 24, 2017న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు చెరువులు, నాలాలు, కుంటలు, వాగులు, నదులు, ఉపనదులను పరిరక్షించడం సుడా బాధ్యత. పట్టణాలు, గ్రామాల్లో స్థలాలను వెంచర్లుగా వేసి విక్రయిస్తున్నారు. ప్రతి ప్రాంతంలో కనీసం వెయ్యి ఎకరాల భూమిని వెంచర్లుగా వేసి కాలనీలు, వాణిజ్య భవన సముదాయాలకు అనువుగా అభివృద్ధి చేస్తున్నారు.

ఇన్నాళ్లూ గతుకులమయంగా ఉన్న రోడ్లన్నీ.. రయ్‌ రయ్‌ మనేలా మారిపోయాయి. రోడ్డు పక్కనే ఉన్న ముళ్లకంపలన్నీ మాయమై.. రంగురంగుల పూల మొక్కలు, పచ్చని చెట్లు పల్లెకు స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్వాసన వెదజల్లే చెత్తంతా.. ఉదయాన్నే డంపింగ్‌ యార్డుకు తరులుతున్నది. రోడ్లపై పారే మురుగునీరు అండర్‌ డ్రైనేజీల నిర్మాణంతో కనుమరుగైపోయింది.. అంతా సుడా చొరవతోనే మూడేళ్ళ కాలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రగతి దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుడాకు ఛైర్మన్ గా బచ్చు విజయ్ కుమార్ ను ఇతర 15 మంది సభ్యులతో కూడిన పాలకవర్గం నియమించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివృద్ధి అడుగుల్లో సాగుతూ మంత్రితో కలిసి ప్రగతి ప్రస్థానంలో భాగస్వామ్యాలు అవుతున్నారు.

రాబోయే 20 ఏళ్లలో సుడా పరిధిలోని జనాభా 20 లక్షలకు చేరుకుంటుందని అంచనాతో విద్యా,వైద్యం, రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలతో పనులు పూర్తి కాగా పలు పనులు కొనసాగుతున్నాయి.

సుడా పరిధిలోని గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు చేపట్టారు. రోడ్లు, డ్రెయిన్లు, లైటింగ్, బృహత్ ప్రకృతి వనం తదితర కార్యక్రమాలకు రూ.43.97 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్దేశించిన విధంగా 90% పనులు పూర్తి చేశారు.

సుడా పరిధిలోని గ్రామాల్లో సెంట్రల్ డివైడర్లు, సిసి రోడ్డు,సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణం చేసి గ్రామ స్వరూపాలు మార్చారు. దీంతో గ్రామస్తుల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అలానే మండలంలోని వి. వెంకటాయపాలెంలోనూ రూ.2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్డు, డివైడర్ ను నిర్మించారు.

రఘునాథపాలెం కి మణిహరంగా 14 ఎకరాల సువిశాల స్థలంలో రూ.2 కోట్ల వ్యయంతో సుడా పార్క్‌, రాష్ట్రంలోనే తొలి బృహత్‌ పల్లెప్రకృతి వనంను సుడా అధ్వర్యంలో నిర్మించి పర్యాటకంగా అభివృద్ధికి కృషి చేశారు.

మౌలిక సదుపాయాలు కల్పనలోనే కాదు రియల్ వ్యాపార రంగంలోనూ సుడా ప్రగతి పథంలో సాగుతున్నది. సుడా ఏర్పడక ముందు 10 ఏళ్ల లో లేఔట్లు ద్వారా స్థానిక సంస్థలకు గిఫ్ట్ చేయబడిన ఓపెన్ స్పేస్, గ్రీన్ బెల్ట్ స్థలాల వైశాల్యం 21.26 ఎకరాలు ఉంటే సుడా ఏర్పడిన 3 ఏళ్లలో స్థలాల వైశాల్యం షుమారు 100 ఎకరాలకు చేరుకుంది. ఇప్పటి వరకు79 వెంచర్లకు సుడా అనుమతులు మంజూరు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాలు, నగరాల రూపురేఖలు మారిపోయాయి. గతంలో పురపాలక సంఘాలను పట్టించుకునే వారే కరువు. సీఎం కేసీఆర్‌ చొరవ, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో అనేక నగరాలకు మాస్టర్‌ ప్లాన్‌లు సిద్ధం చేస్తూ పట్టణాభివృద్ధి సంస్థలను సైతం బలోపేతం చేస్తున్నారు. గజిబిజి గందరగోళానికి చెక్‌ పెడుతూ భవిష్యత్తులో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చక్కని ప్రణాళికలను అందుబాటులోకి తెస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో రాష్ట్రంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందు వరుసలో ఉన్న ఖమ్మంకు సుడా ప్రగతి బాటలో తోడై నిలుస్తుంది. పట్టణ స్థానిక సంస్థ పరిధిలోని పౌరులకు మెరుగైన వసతులు కల్పించేందుకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రాథమ్యాలవారీగా పనులు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking