పచ్చదనంగా మిర్యాలగూడ
రూ.49.62 కోట్లతో 56.26 లక్షల మొక్కలు
నలమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా హరితోత్సవం సందర్భంగా సోమవారం మిర్యాలగూడ నియోజకవర్గంలోని శ్రీనివాస్ నగర్, వెంకటాద్రిపాలెం, తక్కెళ్ళపహాడ్ గ్రామాల్లో ఈదులగూడ చౌరస్తా స్నేహ వెంచర్లో జరిగిన మెగా హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని మొక్కలు నాటారు.

అనంతరం మిర్యాలగూడ మండలం బాదలపురం గ్రామ క్రాస్ రోడ్డు విఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో అటవీ శాఖ అద్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం ఎగ్జిబిషన్‌ను సందర్శించి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి, వచ్చిన ఫలితాల గురించి ప్రజలకు వివరించారు. 9 సంవత్సరాలనుండి మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.49.62కోట్లతో 56.26లక్షల మొక్కలు 173.627ఎకరాలలో నాటామని ఆయన అన్నారు. మానవ మనుగడకు పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ అవసరమని ఆయన అన్నారు.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఎంపిపి నూకల సరళ హనుమంత్ రెడ్డి, జడ్పీటీసీ అంగోతు లలిత హతిరాం, వైస్ ఎంపిపి అమరావతి సైదులు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబునాయక్, ఆర్డీఓ బి.చెన్నయ్య, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు
గడగోజు ఏడుకొండలు, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయకులు, అటవీశాఖ అధికారులు, ఎన్సిసి క్యాడెట్లు, ఎంపిటీసిలు, గ్రామ శాఖ అద్యక్షులు, గీత కార్మికులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.