అమరుల స్ఫూర్తి… ప్రజ్వలిత దీప్తి
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
అమరుల స్ఫూర్తి… ప్రజ్వలిత దీప్తిలాంటిదని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుని అమరుల ఆశయాలను సాదించుకుందామన్నారు. వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన అమరుడు రావులపెంట భిక్షం స్మారకస్తూపం వద్ద నివాళులర్పించి భిక్షం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,నాటి తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం అని అమరుల ఆత్మబలిదానాలు సకల జనుల సాకరంతో తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కళ సహకారం అయ్యిందని తెలిపారు.

సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం కోసం అమరుల ఆత్మబలిదానాలు గుర్తుంటాయన్నారు. వెంకటాద్రిపాలెం గ్రామంలోని అమరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరుడు భిక్షం త్యాగనిరతిని ప్రస్థావిస్తూ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు, బీ.ఆర్.ఎస్ నాయకులు, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమరుల త్యాగాలు.. వృథా కాలేదని, వారి త్యాగనిరతి వెలకట్టలేనిది. అమరవీరుల ఆశయసాధనకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం కృతనిశ్చ యంతో ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యంపిపి నూకల సరళ హనుమంత రెడ్డి , మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్ , మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు , బిఆర్ఎస్ పార్టీ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మండల రైతు బంధు సమితి అద్యక్షులు గడగోజు ఏడుకొండలు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్గ్లు, సర్పంచులు, యం.పి.టి.సిలు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ , రెవిన్యూ , పంచాయతీ రాజ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.