పోడు భూములకు పట్టాలివ్వాలి

తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయదారులకు పట్టాలివ్వాలి

-తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ డిమాండ్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయదారులకు పట్టాలివ్వాలని తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రశాంతి నగర్ లో జరిగిన సమావేశంలో నరాల సత్యనారయణ మాట్లాడుతూ కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం పోడుదారులకు పట్టా భూములు ఇవ్వాలని అటవీ హక్కులచట్టాన్ని రెవిన్యూ చట్టాన్ని సంయుక్తంగా చేసి అర్హులైన ప్రతి పోడు రైతుకు పట్టాలు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారుల ద్వారా పంటలు నష్టపోయిన పోడు వ్యవసాయదారులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న పోడు వ్యవసాయదారులకు నష్టపరిహారంతో పాటు పోడుదారులకు పట్టాలు చెల్లించాలని తెలంగాణ రక్షణ సమితి తరపున డిమాండ్ చేశారు.కేసిఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు కుర్చీలు వేసి కూర్చొని ఆయా ప్రాంతాలలో స్వచ్ఛందంగా పోడుదారులకు పట్టాలు పంచుతామన్నారు.ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలని లక్షలాది మంది పోడు వ్యవసాయదారులకు న్యాయం చేయాలని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ రక్షణ సమితి డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి విభాగ రాష్ట్ర కన్వీనర్ అశ్వరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సూర్యనారాయణ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి మహ్మద్ సలీం ఖురేషి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొత్తూరు శంకర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం కన్వీనర్ జక్కం సాయి కనకం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking