*ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య…*
నేరేడుచర్ల అక్షిత న్యూస్:- ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని రామాపురంలో ఆదివారం చోటు చేసుకుంది. పట్టణంలోని రామాపురానికి చెందిన మేండే నాగరాజు (35) ఆర్థిక ఇబ్బందులతో శనివారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మెండె నాగరాజు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, ఏ పని లేక ఇంటి వద్దనే ఉంటూ మద్యానికి బానిస అయ్యాడయ్యాడని, శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తాగిన మైకంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అనంతరం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం నాడు మృతి చెందాడు. మృతుని తల్లి మెండే అందెమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.