లయన్స్ వనిత డైమండ్ క్లబ్ తో మరిన్ని సేవలు

నూతనంగా లయన్స్ వనిత డైమండ్ క్లబ్ ఏర్పాటు

*రీజినల్ చైర్మన్ డైమండ్ శ్రీనివాస్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడలో నూతనంగా లయన్స్ వనిత డైమండ్ క్లబ్ ను ఏర్పాటు చేసినట్టు క్లబ్ రీజినల్ చైర్మన్ డైమండ్ మాశెట్టి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 20 మంది మహిళలతో కేవలం స్వల్ప సమయంలో క్లబ్ ఏర్పాటు చేశామన్నారు. క్లబ్ అధ్యక్షులుగా రాయపూడి ఆశాలత, కార్యదర్శిగా మాశెట్టి గీత, కోశాధికారిగా సామ సంతోషిలను ఎన్నుకున్నామన్నారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు ఆశాలత మాట్లాడుతూ జూలై ఒకటిన డాక్టర్స్ డే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని ఆమె అన్నారు. అవసరమున్న పేదలకు సేవాలాందిస్తామని ఆమె అన్నారు. సమావేశంలో క్లబ్ బాధ్యులు ఏచూరి మురహరి, రాయపూడి రామ్మోహన్ రావు, కోల సైదులు, బిఎం. నాయుడులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking