ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ….
మేడ్చల్, అక్షిత బ్యూరో:
దుండిగల్ పురపాలక గాగిల్లాపూర్ లో బుధవారం సి.యస్.అర్ ఫండ్స్ తో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంను ప్రారంభించిన దుండిగల్ పురపాలక చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు.
పిల్లలు ఇష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని, విద్యకు మించిన దైవము ఉండదని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ బీఆర్ఎస్ పార్టీ అద్యక్షులు సంజీవ రెడ్డి, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు కుంటి అరుణ నాగరాజు, శంభీపూర్ క్రిష్ణ, కొల సాయి బాబా, నరసింగం భారత్ కుమార్, నాయకులు కుంటి నాగరాజు, సుధాకర్ రెడ్డి, మోర అశోక్, నర్సింహ, జగన్, ఎల్లయ్య, శ్రీనివాస్, వీర స్వామి, దుర్గేష్, బాలయ్య, యాదయ్య, జీతయ్య, రమేష్, ఆకుల అశోక్, దశరథ్, శ్రీనివాస్, ప్రభాకర్, గుడిసె ఈశ్వర్, జ్ఞానేశ్వర్, హరీష్, విజయ్, మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….