పండ్ల తోటల పెంపకానికి
ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి
*ఎంపిడిఓ జ్యోతిలక్ష్మి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో తోటల పెంపకానికి, బిందు సేద్యం పరికరాలకు ప్రభుత్వం రాయితీలకు ఈ నెల 31లోగా రైతులు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి కోరారు. ఐదెకరాల లోపు రైతులు, ఎస్సి, ఎస్టీ, ఉపాధి జాబ్ కార్డులున్న రైతులు అర్హులని పేర్కొన్నారు. పండ్లతోటలు మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, సీతఫలం, సపోట, మునగ, డ్రాగన్, నేరేడు, దానిమ్మ, కొబ్బరి తదితర పండ్ల నాటిన రైతులకు వెనువెంటనే ఆధార్ లింక్ తో బ్యాంకు ఖాత నెంబర్ ఇస్తే డబ్బులు జమ అవుతాయన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, వ్యవసాయ విస్తరణ అధికారి, ఎడిఎ, ఎపిఓ, ఎంపిఓ, ఎంఎఓ, ఎంపిడిఓలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.