దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి

దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
*జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమి క్రమబద్దికరణ జీవో 58, 59 దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు.

ఆదివారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, ప్రకాష్ నగర్ కాలనీలో దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో మొత్తం 1,368 దరఖాస్తులు అందాయని వీటి పరిశీలన కోసం ఐదుగురు తహసీల్దార్ లను నియమించినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం ప్రభుత్వ నిర్ధారిత రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ బి.చెన్నయ్య, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, ఎం.అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking