మణిపూర్ ఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలి

మణిపూర్ ఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలి

సిబిసి అధ్యక్షుడు సామ్యేల్ జాన్సన్

వేములపల్లి, అక్షిత ప్రతినిధి:

మణిపూర్ రాష్ట్రంలోని కుకి తెగకు చెందిన క్రైస్తవులపై దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వేములపల్లి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి అధ్యక్షుడు సామ్యేల్ జాన్సన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం ఆరాధన అనంతరం కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. గత కొన్ని మాసాలుగా మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నప్పటికి అణిచివేయటంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటూ కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ చూపకపోవడం బాధాకరమన్నారు. స్త్రీలను వివస్త్రలను చేసి విచక్షణ రహితంగా అత్యాచారాలకు పాల్పడిన దుండగులను అరెస్టు చేసి శిక్షించకపోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాజ్యాంగంలో అన్ని మతాలవారికి సమాన అవకాశాలు కల్పించినప్పటికీ క్రైస్తవులపై మాత్రమే దాడులు చేసి వారిని చంపడం కిరాతకమైన చర్యని ఖండించారు. బిజెపి పాలనలో క్రైస్తవులకు రక్షణ కరువైందని, ఇటీవల దేశంలో అన్ని రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ప్రధాని మోదీ ఈ దాడులను అరికట్టేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిబిసి ఉపాధ్యక్షుడు పి. ఇమాన్యువల్ కార్యదర్శి పి జాన్ ఇజ్రాయిల్, కోశాధికారి డి సల్మాన్ రాజ్, ఉప కార్యదర్శి పుట్టల జోసెఫ్ డానియేల్, ఉపకోశాధికారి పి. శ్యాంసన్, స్త్రీల అధ్యక్షురాలు పి. వజ్రమ్మ సామ్యేల్, యూత్ డైరెక్టర్ పి. నతానియల్, సండే స్కూల్ సూపరిండెంట్ పి. విజయ ప్రేమ్ కుమార్, క్వయర్ డైరెక్టర్ డి. సరిత రవి, అవుట్ రీచ్ కన్వీనర్ పి. ఎలీషా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ దైద వెంకట రత్నం, టి జానయ్య, ఎం దానియేలు, డీకన్ పి. శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking