విశ్వరూప మహాసభకు దండిగా కదలాలి

విశ్వరూప మహాసభకు దండిగా కదలాలి
ఎంజెఎఫ్ జాతీయ కోఆర్డినేటర్
తిప్పారపు లక్ష్మణ్ మాదిగ

నల్లగొండ అక్షిత ప్రతినిధి : విశ్వరూప మహాసభకు ఎంఆర్ పిఎస్ శ్రేణులతో పాటు ఎంజెఎఫ్ నేతలు కూడా దండిగా కదలాలని ఎంజెఎఫ్ జాతీయ కోఆర్డినేటర్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ మాదిగలు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంజెఎఫ్ సమన్వయకర్త గాదె రమేష్ అధ్యక్షతన శనివారం మాదిగ జర్నలిస్టుల ఫోరం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంజెఎఫ్ ఇంచార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ మాదిగతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంజెఎఫ్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, సుంచు అశోక్ మాదిగలు మాట్లాడుతూ జిల్లాలో ఎంజేఎఫ్ ను మరింత శక్తివంతంగా నిర్మాణం చేయాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యలపై ఆగస్టు మొదటి వారంలో ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జర్నలిస్టు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొనాలని సూచించారు.

దీంతోపాటు ఆగస్టు రెండో వారంలో ఎస్సీ రిజర్వేషన్ల ఏబిసిడి వర్గీకరణ కోసం జరిగే విశ్వరూప మహాసభకు మాదిగ జర్నలిస్ట్ ఫోరం సభ్యులు నాయకులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. వాళ్ళ సొంత గ్రామాల నుంచే కాకుండా మరో నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని జన సమీకరణ చేయాలన్నారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలోని ఎంజెఎఫ్ నాయకులు ఇంచార్జి బాధ్యతలు తీసుకొని హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నల్లగొండ జిల్లా అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్, నాయకులు ఉదరి శ్యాంకుమార్, సైదులు, పి వెంకటయ్య, టీ మట్టయ్య , విజయభాస్కర్, చెరుకు సైదన్న , ఒగ్గు విశాఖ, లింగస్వామి, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking