విద్యార్థి అదృశ్యం
– కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
మండలంలోని సర్నేనిగూడెం గ్రామం, అంబబావిగూడెం అవాస గ్రామానికి చెందిన దేవనబోయిన యాదమ్మ భర్త సత్తయ్య వారి కూతురు దేవనబోయిన శిరీష తండ్రి సత్తయ్య, వయస్సు 19 సంవత్సారాలు, వృత్తి స్టూడెంట్, రోజు మాదిరిగానే శనివారం నాడు కళాశాల కి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన కూతురు ఆదివారం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లి తన కూతురు కనిపించడం లేదని, రామన్నపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగిందని, అట్టి పిర్యాదు మేరకు రామన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం. లక్ష్మయ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.