పారిశ్రామిక విప్లవ ప్రదాత… కేటీఆర్
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఎన్ బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్దార్థ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తుండ్రు. దేశ, విదేశాల నుంచి అత్యున్నత స్థాయి కంపెనీలను హైదరాబాద్ నగరానికి రప్పించడoలో విశిష్ఠ కృషి చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తూ విప్లవ ప్రదాత… కేటీఆర్ అందరి అభిమానాన్ని చూరగొంటుoడ్రు.మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని బిఆర్ఎస్ నియోజకవర్గ యువనేత, ఎన్ బిఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ నల్లమోతు సిద్దార్ద కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య (సంపత్), మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, కౌన్సిలర్లు తిరుమలగిరి వజ్రం, బంటు రమేష్, ఇలియాస్, బిఆర్ఎస్ పట్టణ యువజన ఉపాధ్యక్షులు యరమల్ల దినేష్, నాయకులు శ్రవణ్ రెడ్డి, వినోద్, మహేష్, గయాజ్, మొబిన్, బాచి, గోపి, సంపత్, మొండికత్తి లింగయ్య, బాల సత్యనారాయణ, శివ పాల్గొన్నారు.