జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వాలి
జాప్యాన్ని నిరసిస్తూ బైఠాయింపు
తహశీల్దార్ హమీతో ఆందోళన విరమణ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో జాప్యం పట్ల మిర్యాలగూడ జర్నలిస్టులు శుక్రవారం తహశీల్ కార్యాలయంలో తహశీల్దార్ ఛాంబర్ లో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇండ్ల స్థలాల విషయంలో అనేక ఇబ్బందులు వస్తున్నాయని పరిష్కరించి పట్టాలు ఇవ్వాలని పలు మార్లు కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ భూమిని క్లీన్ చేసుకున్నామని దానిపై కొందరు కబ్జాదారులు అడ్డుపడుతున్నారని చెప్పారు. ప్రభుత్వపరంగా పట్టా లేని వారికి ఎలాంటి అధికారాలు లేకున్నా కబ్జా నుండి తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. పట్టాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడి అర్హులైన జర్నలిస్టులకు పట్టాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం వరకు భూమి విషయంలో స్పష్టత తీసుకొచ్చి పట్టాల పంపిణికి కృషి చేస్తానని తహసీల్దార్ అనిల్ కుమార్ హామీతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఖాజా హమీదోద్దీన్, ఆయూబ్, జి.వెంకన్న, మహేష్, ఎండి అస్లాం, ఖాజా నాజిమోద్దీన్, నరేందర్ రెడ్డి, మంద సైదులు, వంశీ, మహేష్, నాగరాజు, నాగచారి, వేణు, భాస్కర్, రామకృష్జ, అరుణ్, ఎన్.నాగభూషణం, సతీష్, జయరాజు, ఉమమహేశ్వర్, ప్రసాద్, వీరబాబు, నగేష్, సృజన్ కుమార్ , జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.