మానవ నిర్మిత సౌధం… సాగర్ జలాశయం

మానవ నిర్మిత సౌధం
సాగర్ జలాశయం

చారిత్రాత్మక కట్టడం

నాగార్జున సాగర్ డ్యామ్

సాగర్ డ్యాం తీరుపై కలెక్టర్ ఆరా

నాగార్జున సాగర్, అక్షిత ప్రతినిధి :
మానవ నిర్మిత సౌధం సాగర్ జలాశయం. చారిత్రాత్మక కట్టడమైన నాగార్జునసాగర్ డ్యామును మంగళవారం జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ సందర్శించారు. డ్యాం స్పిల్ వే, గేట్ ల మరమ్మత్తు పనులు పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగర్ డ్యాం పుట్టుపూర్వోత్తరాలు అడుగగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన, నిర్మాణం, ప్రాజెక్టు నిర్మాణానికి ఇంజనీర్లు, వేలాదిమంది కూలీల ద్వారా నిర్మాణం చేపట్టిన తీరు కలెక్టర్ కు ఇంజినీర్ లు వివరించారు తెలంగాణలోని నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సరిహద్దులపై నందికొండ వద్ద సాగర్ ప్రాజెక్టును నిర్మించినట్లు తెలిపారు.

డ్యాముకు ఇరువైపులా నల్లగొండ జిల్లా గుండా ఎడమ కాలువ, కుడి కాలువ గుండా గుంటూరు జిల్లాలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. ఈ ప్రాంతానికి చారిత్రాత్మక నేపథ్యంలో భాగంగా బౌద్ధులు, ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లు కలెక్టర్ కు వివరించారు. సాగర్ జలాశయం 590 అడుగుల నీటి సామర్థ్యం కలది. కానీ ప్రస్తుతం జలాశయంలో 515 అడుగులు మాత్రమే నీటి నిల్వ ఉన్నది అన్నారు. డ్యాంకు మొత్తం 26 గేట్లు ఉన్నాయి అన్నారు. డ్యాం రక్షణలో భాగంగా గేట్ల మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు తెలిపారు.

అదేవిధంగా నీటిని విడుదల చేసే స్పిల్ వే పనులు పురోగతిలో ఉన్నట్లు ఇంజనీ ఇల్లు కలెక్టర్ కు వివరించారు. నీటి కొరత కారణంగా ప్రస్తుతము విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేసినట్లు వివరించారు. డాం రక్షణలో భాగంగా పోలీసుల ద్వారా గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాగార్జున సాగర్ ద్వారా అందించే నీటిని వినియోగించుకొని వేలాది మంది రైతులు లక్షల ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నట్లు ఇంజనీర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సాగు నీటి పారుదల చీఫ్ ఇంజనీర్ వి.అజయ్ కుమార్, హిల్ కాలనీ ఎస్ ఇ పి.వి.ఎస్ నాగేశ్వరరావు, ఈ.ఈ.మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking