భీరప్ప ఆలయ పునర్నిర్మాణం కోసం మంత్రిని కలిసిన కురుమ సంఘం నాయకులు

భీరప్ప ఆలయ పునర్నిర్మాణం కోసం మంత్రిని కలిసిన కురుమ సంఘం నాయకులు….

మేడ్చల్ నియోజకవర్గం పలు అభివృద్ధి పనులకు. ప్రధాత మంత్రి మల్లారెడ్డి. కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ…

మేడ్చల్, అక్షిత బ్యూరో : మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ వీరభద్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని భీరప్ప కామరాతి దేవాలయం పునర్నిర్మాణం కొరకు తెలంగాణ రాష్ట్ర కార్మిక,ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు. శాలువాతో సత్కరించి పూల బొక్కే అందజేసిన మేడ్చల్ జిల్లా కురుమ. యువ నాయకులు,మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ,మేడ్చల్ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు ఒగ్గు శంకర్ కురుమ.సాను కూలంగా స్పందించిన మంత్రి మల్లారెడ్డి తన సొంత నిధుల నుండి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇంకా ఏమైనా రోడ్లు లేకుండా ఇబ్బంది పడకుండా.చూసుకుంటానని తెలిపారు.కురుమ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి తన సొంత నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,సి సి రోడ్లు,బి టి రోడ్లు, భవనాలు,కమ్యూనిటీ హాల్లు,కుల సంఘాల భవనాలు ఏమున్నా నాకు చెప్పండి నేను నా సొంత నిధులతో చేపిస్తా అని చెప్పే ఏకైక ప్రజా నాయకుడు మంత్రి మల్లారెడ్డి.ఇప్పటి వరకు మేడ్చల్ నియోజకవర్గం వర్గం నుండి చాలా మంది ఎం ఎల్ ఏ లు,ఎం పలు.మంత్రులు అయినారు కానీ ఏ ఒక్కరూ కూడా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆలోచనే రాలేదు మంత్రి మల్లారెడ్డి మాత్రం మేడ్చల్ నియోజకవర్గం లో ప్రతి కాలనీలలో ఊర్లల్లో సి సి రోడ్లు తన సొంత నిధులతో పనులు పూర్తి చేస్తారు. మేడ్చల్ నియోజకవర్గం ప్రజలు అంటూ ఎల్లప్పుడూ మంత్రి మల్లారెడ్డి వెంబడే ఉంటామని తెలియజేస్తున్నారు..ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్,మేడ్చల్ మున్సిపాలిటీ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్,మేడ్చల్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు చీర్ల దయానంద్ యాదవ్,మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్స్ కౌడే మహేష్ కురుమ,బత్తుల మధుకర్ యాదవ్,మేడ్చల్ పట్టణ మాజీ వార్డు మెంబర్ కౌడే నాగేందర్ కురుమ,మేడ్చల్ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు ఒగ్గు శంకర్ కురుమ,మైల శంకరయ్య కురుమ,కౌడే భిక్షపతి కురుమ,గౌర్ల యాదయ్య కురుమ,కౌడే సత్తయ్య కురుమ,గుండ గనేష్ కురుమ,కౌడే నరేందర్ కురుమ,శ్రీరంగవరం నర్సింహ్మా కురుమ,ఒగ్గు భాస్కర్ కురుమ,బాలప్ప,కౌడే శ్రీశైలం,రమేష్,విజయ్,గౌర్ల నర్సింగ్ రావు కురుమ,మైల జీతయ్య కురుమ,ఒగ్గు వెంకటేష్ కురుమ,మేడ్చల్ పట్టణ కురుమ యువత కౌడే రాజు,ఒగ్గు శ్రీకాంత్,గౌర్ల విఘ్నేష్,మైల శ్రీనివాస్,ఒగ్గు బాబు,యువరాజు మేడ్చల్ పట్టణ కురుమ సంఘం కార్యవర్గ సభ్యులు,మేడ్చల్ పట్టణ కురుమ యువత సంఘం కురుమ సంఘం నాయకులు,కురుమ కుల బాంధవులు మేడ్చల్ మున్సిపాలిటీ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking