రైతుల పక్షపాతి కేసీఆర్

రైతుల పక్షపాతి కేసీఆర్

రుణమాఫీ రైతుల హర్షం 

పాలుట్ల బాబయ్య

 అక్షిత న్యూస్  మాడుగులపల్లి:

రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాడుగులపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య అన్నారు . గురువారం మండల కేంద్రంలో రైతులకు రుణమాఫీ ప్రకటించినందుకు మద్దతుగా ముఖ్యమంత్రి కేసీఆర్,  చిత్రపటానీకు పాలాభిషేకం చేసి మాట్లాడారు. రైతుల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, రుణమాఫీ, గిట్టుబాటు ధర లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. 19000 కోట్లతో రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపిందని తెలిపారు.

రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు బిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి రానున్న ఎన్నికల్లో ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ మోషన్ అలీ,బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కందిమల్ల నరేందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, మిర్యాల మసుదన్, సుధీ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు మారుతి వెంకటరెడ్డి,సింగం శివ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దర్శనం రాంబాబు, కాసిం, స్టాలిన్,సిద్ధార్థరెడ్డి,దామోదర్ రెడ్డి,  గ్రామ శాఖ పుల్లంల ఏడుకొండలు, గంగాధర్, కృష్ణయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking