తహసిల్దార్ గా ఎస్.కె జమీరుద్దీన్

తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్.కె జమీరుద్దీన్

అక్షిత న్యూస్, మాడుగులపల్లి:

మాడుగులపల్లి నూతన తహసీల్దారుగా ఎస్.కె జమీరుద్దీన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. నూతనకల్ మండలం త‌హసీల్దార్ గా పనిచేసిన ఆయన బదిలీపై మాడుగుల పెళ్లి మండలం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. సిబ్బంది సైతం విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. బాధ్యతలు చేపట్టిన త‌హ‌సీల్దార్ కు డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఆర్ఐ లు స్వాగతం పలికారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking