గర్వించదగ్గ ముద్దుబిడ్డ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ ” భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని మిర్యాలగూడ శాసనసభ్యుడు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 15న ప్రతీఏటా దేశవ్యాప్తంగా ‘ఇంజినీర్స్ డే’గా ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడారు. మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిక్కులకు చాటారని. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు. నేటికీ అవి చెక్కుచెదరలేదంటే అతిశయోక్తి కాదన్నారు. భారత్‌లో అత్యంత గొప్ప ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందని భాస్కర్ రావు తెలిపారు. అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ నూతన కార్యాలయాన్ని, దామరచర్ల మండలం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో పంచాయతీరాజ్‌ సబ్‌ డివిజన్‌ నూతన కార్యాలయాలను నల్లమోతు భాస్కర్‌ రావు ప్రారంభించారు.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి గారు, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జడ్పీటీసీ అంగోతు లలిత హాతిరాం, కుర్ర సేవ్యా నాయక్, ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి, నందిని రవితేజ, ధనావత్ బాలాజీ నాయక్, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరం బుచ్చయ్య, వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ చిట్టిబాబు, వైస్ ఎంపీపీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోగవెల్లి వెంకటరమణ చౌదరి(బాబ్జి), ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఎంపీడీఓలు, పంచాయత్ రాజ్ డి.ఈ వెంకటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking