కొత్త మండలంగా మల్లంపల్లి

మల్లంపల్లి కొత్త మండలం గెజిట్ నోటిఫికేషన్ జారీ 

అభ్యంతరాలు, సూచనలుంటే

15 రోజుల్లోగా అందజేయాలి

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు, అక్షిత ప్రతినిధి :

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో కొత్త మండలం మల్లంపల్లి మండలం ఏర్పాటుపై గెజిట్ ను విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేడోక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో మల్లంపల్లి మండలాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 331/ 2023, తేది.23,09.2023 జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ మండలం ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉన్నట్లయితే ఇంగ్లీషు లేదా తెలుగు భాషల్లో లిఖిత పూర్వకంగా 15 రోజుల్లోగా నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ ఆ ప్రకటన లో కోరారు.ఈ గెజిట్ నోటిఫికేషన్ ను అన్ని జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రచురించాల్సిందిగా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking