చిరకాల  కోరిక నెరవేర్చిన కేసీఆర్

చిరకాల  కోరిక నెరవేర్చిన కేసీఆర్

ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి

*అంబెడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి నినాదాలు చేసిన నాయకులు.
* దివంగత నేత కుసుమ జగదీష్ చిత్ర పటానికి నివాళి.
* నూతన మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం అని పిలుపు

ములుగు,  అక్షిత ప్రతినిధి :

మల్లంపల్లిని మండలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా బీఆర్ఎస్
పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ,నాయకులు, కార్యకర్తలు, జేఏసీ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు,ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

మల్లంపల్లి గ్రామాన్ని మండలం చేయడం ఇక్కడ ప్రజల కోరికను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు.ప్రజలు ,పార్టీ నాయకులు జేఏసీగా ఏర్పాటై సమిష్టిగా మండలాన్ని సాదించుకున్నారని దివంగత నేత కుసుమ జగదీష్ మండలం కోసం చాలా కష్టపడి కేసీఆర్ కి విన్నవించారన్నారు. మంత్రులు దయాకరరావు ,సత్యవతి రాథోడ్ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లారని ప్రభుత్వం,అధికారులు 14 గ్రామాలను కలుపుకొని మండలం ఏర్పాట్లు పూర్తి చేస్తారన్నారు. రాష్ట్ర గిరిజన-స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కి, పంచాయతీ రాజ్ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కి,మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవిత కి,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కి, పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కి,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డికి,రాష్ట్ర రెడ్ కో చైర్మన్ ఎరువా సతీష్ రెడ్డి కి,ములుగు జిల్లా గ్రంధాలయం చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ కి,ప్రజాప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking