బాలరాజును కలిసిన బాలు

బాలరాజును కలిసిన బాలు
న్యూ ఢిల్లీ, అక్షిత ప్రతినిధి :

బిజేపి సెంట్రల్ కో ఆర్డినేటర్ ఎన్ బాలరాజును భువి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మైలారం బాలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం న్యూ ఢిల్లీలోని బాలరాజు నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా భువి ఇండస్ట్రీస్ అధినేత మైలారం బాలు మాట్లాడుతూ భువి అల్కాలిన్ వాటర్ ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు, ఆయా రాష్ట్రాల్లో తమ ఇండస్ట్రీని నెలకొల్పే ప్రక్రియలో భాగంగా తగిన సహకారం కోరుతూ బాలరాజును మర్యాద పూర్వకంగా కలుసుకున్నానన్నారు. తొలుత తెలంగాణలో తమ వాటర్ బాటిల్స్ అందుబాటులోకి రానున్నట్లు, ఆ తదుపరి దేశ వ్యాప్తంగా విస్తరింప జేసి ప్రపంచ స్థాయి బ్రాండింగ్ గా మార్కెట్ లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అత్యంత విలువైన, స్వచ్ఛతతో కూడిన ఆల్కాలిన్ వాటర్ ను అత్యంత నాణ్యత ప్రమాణాలు కల్గి ఉంది క్వాలిటీ, క్వాంటిటీతో సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలకే విక్రయించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. పేరెన్నిక కల్గిన వాటర్ బాటిల్స్ కు ధీటుగా భువి వాటర్ బాటిల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. చిన్న వయస్సులో ఇంతటి ఇండస్ట్రీని నెలకొల్పి ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న బాలును బిజేపి నేత బాలరాజు అభినందించారు. యువ ఇండస్ట్రీ నేతగా ముందుకు సాగుతున్న బాలుకు తమ వంతు చేయూత నందిస్తామని హమీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking