అజయన్నకు ఆత్మ బంధువుని నేను

అజయన్నకు ఆత్మ బంధువుని నేను

-అన్న కోరితే నా యావదాస్తిని క్షణాల్లో రాసిచ్చేస్తా

-శిలగా ఉన్న నన్ను శిల్పంగా మార్చింది “పువ్వాడ” కుటుంబమే

-అజయ్ అన్నతో నాలుగు దశాబ్దాల సాన్నిహిత్యం నాది

-నా భూమి కోసం కక్కుర్తి పడాల్సిన అగత్యం అన్నకు లేనే లేదు

-18 ఏళ్ల వయసులోనే రాజకీయ పదవులను రుచి చూసిన అనుభవం నాది

– పులిపాటీ విధ్యా సంస్థల అధినేత డాక్టర్ పులిపాటీ ప్రసాద్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఓ మిక్కిలినేని నువ్వు ముక్కున వేలేసుకునే రోజు దగ్గర పడింది.అసత్యాలు అందంగా వండివారిస్తే అవి నిజాలని నమ్మే అమాయకులు ఖమ్మం నియోజకవర్గంలోనే లేరు.ఇప్పటికైనా నిద్రలేచి కళ్ళు నులుముకుని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్..! లేకుంటే ఇంకా రాజకీయ అజ్ఞానుడిలాగే మిగిలిపోతావని పులిపాటీ విధ్యా సంస్థల అధినేత ఖమ్మం పౌర సమితి అధ్యక్షులు డాక్టర్ పులిపాటీ ప్రసాద్ అన్నారు. అక్షిత ప్రతినిధితో మాట్లాడుతూ మంత్రి పువ్వాడ అజయన్నకు నేను చిరకాల మిత్రుడిని. ఆయనకు ప్రియాతి ప్రియమైన ఆత్మ బంధువుని. పెద్దాయన పువ్వాడ నాగేశ్వరరావు- విజయలక్ష్మి పుణ్య దంపతులు నాకు మాతా,పితల సమానులు. చిన్ననాటి నుంచి నా ఉనికి పువ్వాడ కుటుంబంతో పెనవేసుకుంది. ఖమ్మంలో ఓ విద్యావేత్తగా రాజకీయ ప్రముఖుడిగా నేను ప్రస్థానం కొనసాగిస్తున్నానంటే పువ్వాడ కుటుంబం నాకు వెన్నుముఖగా ఉండటమే కారణం అన్నారు.

అజయన్నతో నాలుగు దశాబ్దాల సాన్నిహిత్యం నాది. నా ఆర్థిక, రాజకీయ ఉనికికి అజయన్నే మూల కారకుడు. అన్న కనుసైగతో శాసిస్తే నా యావదాస్తిని ప్రజాసేవకు దారాదత్తం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆయన సైనికుడిని నేను. అలాంటిది తుచ్ఛమైన నా భూమి కోసం అజయన్న అర్రులు చాస్తాడని రాసిన రాతలు పూర్తిగా వాస్తవ దూరం. దానిని తీవ్రంగా ఖండిస్తున్నాను.నాకు కనీసం ముఖ పరిచయం కూడా లేని మిక్కిలినేని నరేంద్ర మీరు చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి చూసుకోండి. నేను మీతో ఎప్పుడూ కలిసి మాట్లాడింది లేనేలేదు.నా కష్ట సుఖాలు చెప్పుకున్నదీ లేదు. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఖమ్మం నియోజకవర్గ నడిబొడ్డున తొలి అమాత్యునిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ క్షణం నుంచి అభివృద్ధి కాముకుడిగా జనంతో కలిసి అడుగులేస్తున్న అజయన్నపై మీరు పేలిన అవాకులు, చవాకులు స్థాయికి మించినవని తెలుసుకోండి. రాష్ట్ర మంత్రిగా అజయన్న ప్రస్థానాన్ని కళ్ళు ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనైనా అజయన్న అజేయుడిగా నిలిచిన సత్యం మీ మస్తిష్కానికి బోధపడుతుంది. ఎన్నికలు సమీపిస్తున్నాయని మీకున్న పనికిమాలిన ప్రతిభతో జనాన్ని ఏమార్చాలని చూడటం మీ మూర్ఖత్వమే. మీ రాజకీయ కుటిలత్వానికి జనం సమాధానం చెబుతారన్న సంగతి ఇంకో రెండు నెలల్లో మీకే తెలిసిపోతుంది. ముచ్చటగా మూడోసారి అజయన్నకు పట్టం కట్టాలని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తుంటే మీరు గోబెల్స్ ను మించిన తరహాలో చేసే ప్రచారాలు ఆయన వేలి కొనగోటిని కూడా తాకలేవన్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు.గండిపేటలో మహా నేత నందమూరి తారక రామారావు ఆంతరంగిక హోదాలో పని చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు వంటి మహారధికి పర్సనల్ సెక్రటరీగా బాధ్యతలుగా నెరవేర్చిన నేర్పరిని నేను. విద్యార్థి దశలోనే తెలుగు విద్యార్థి రాష్ట్ర కన్వీనర్ గా పనిచేశా. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శిగా విధులు నిర్వహించి మహామహుల మన్ననలు పొందా. 1995 లోనే మహా నాయకుడు ఎన్టీఆర్ ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ గా బీ ఫార్మ్ ఇచ్చి నాకు పోటీ చేసే అవకాశం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు దాన్ని ఉపయోగించుకోలేకపోవడంతో అంతకు మించిన హోదా కలిగిన ఆంద్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు రీజినల్ చైర్మన్ గా అన్న నన్ను నియమించారు. ఆ తర్వాత సెనేట్ మెంబర్ గా సివిల్ సప్లై డైరెక్టర్ గా ఇలా తెలుగుదేశం పార్టీలో సుమారు 25 ఏళ్ల పాటు ఎన్నో పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చిన అనుభవం నాది. 40 ఏళ్ల నాడే ఏఎస్ఆర్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ గా అజయన్న సారధ్యంతో పోటీ చేసే అవకాశం దక్కింది. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో జిల్లా ఉపాధ్యక్ష పదవిలో ఉన్న నేను అజయన్న గెలుపు కోసం కీలక పదవిని సైతం వీడి అన్న చెంతకు వచ్చేశాను. టిడిపిలో నన్ను సస్పెండ్ చేసిన ఆ క్రమంలోనూ నేను పువ్వాడ కుటుంబాన్నే అంటిపెట్టుకొని ఉన్నాను. అలాంటిది నన్ను రాజకీయంగా అజయ్ అన్న పక్కన పెట్టాడని వాస్తవ దూరమైన రాతలు రాయడం సిగ్గుచేటు మిత్రమా. అభివృద్ధిలో సంక్షేమంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన అజయ్ అన్నతో రాజకీయంగా పోటీపడే సత్తా ఉంటే కాచుకోండి.! విశ్వ నగరమైన హైదరాబాద్ కు ధీటుగా ఖమ్మం అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తున్న అజయన్న ను ఓటమి భయం వెంటాడుతుందని చేసిన వ్యాఖ్యలు నవ్వు పుట్టిస్తున్నాయి. ప్రియమైన మిక్కిలినేని నరేంద్ర మీకు ఇదే నా విన్నపం.! అజయన్నను ఎదుర్కొనే సత్తా ఉంటే రాజకీయంగా ఎదుర్కొండి. అంతేతప్ప వ్యక్తిగత దూషణలు చేసి అజయ్ ని దెబ్బ కొట్టాలని చూడడం మీ శక్తికి మించిన పనే అవుతుంది. ఏ పోటీ అయినా సమ ఉజ్జీల మధ్య జరుగుతుందన్న వాస్తవాన్ని మర్చిపోకండి. అజయన్నపై పోటీకి అభ్యర్థి కూడా లేని మీ పార్టీ నాయకత్వ మటిమను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఢీకొట్టగలిగే అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ అన్నింటిలోనూ అజేయుడుగా ఉన్న అజయ్ ను ఢీకొట్టడం ఎలా సాధ్యమో ఒక్కసారి మెలకువలోకి వచ్చి ఆలోచించండి సోదరా. నూటికి నూరుపాళ్ల అబద్దాలను రంగరించి ఆకాశాన్ని తాకిన అజయన్నపై బురద చల్లాలని చూస్తే ఆ బురద తిరిగి మీ మీదే పడుతుందన్న వాస్తవాన్ని గుర్తించండి. నాకు అజయన్నతో ఉన్న ఆత్మబంధాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదు. ఒక్క శాతం కూడా నిజం లేని వ్యాఖ్యలను వాట్సాప్ లో వండివారిస్తే నాలుగు దశాబ్దాల మా సాన్నిహిత్యం చెదిరిపోతుందని కలలు కనడం మీ మూర్ఖత్వమే. నన్ను రాజకీయంగా పక్కన పెట్టారని.. నా భూమిని అజయన్న తన వశం చేసుకున్నాడని మీరు రాసిన పిచ్చి రాతలను నిరూపించడానికి సిద్ధమేనా..? మీరు నమ్మిన ఏ దైవం చెంతనైనా మీ రాతలు నిజాలని నిరూపించగలరా.? మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి నేను సిద్దమన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking