అభివృధ్ది పనులపై సమీక్ష, కోడ్ ముగిసే వరకు శంకుస్థాపన లుండవ్ !

అభివృధ్ది పనులపై సమీక్ష
కోడ్ ముగిసే వరకు శంకుస్థాపన లుండవ్
కలెక్టర్ ఆర్ వి కర్ణన్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి నిర్మాణ పనుల వివరాలను జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సమీక్షించారు.

బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్, ఆర్ అండ్ బి, ఆర్.డబ్లూ.ఎస్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్, ఇంజనీరింగ్ విద్య సంక్షేమం తదితర శాఖల ఇంజనీర్లు అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ప్రస్తుతము జరుగుతున్న అభివృద్ధి నిర్మాణ పనులు ఎన్నికల నిబంధనల మేరకు జరగాలన్నారు. ఇప్పటివరకు ప్రారంభించని పనులను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, నూతన పనులు చేపట్టరాదని సూచించారు. ఇరిగేషన్ శాఖ పరిధిలోని ప్రాజెక్టుల మరమ్మత్తులు, రిపేర్లు, షట్టర్ పనులు మొదలగున్నవి అవసరమైతే ఈసీ అనుమతి తీసుకొని చేయాలన్నారు. గ్రామపంచాయతీలలో ఇప్పటికే ప్రారంభమైన వివిధ దశలలో ఉన్న నిర్మాణ పనులు యధావిధిగా కొనసాగించవచ్చు అన్నారు. మున్సిపల్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మొదలగు శాఖల అధీనంలోని అతిథి గృహాల్లో ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు అప్పగించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ప్రచారాలు చేయరాదన్నారు. అదేవిధంగా ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు, స్టిక్కర్లు ఏంటిoచరాదని ఆయన తెలిపారు. మున్సిపాలిటీలలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై హోర్డింగ్స్, వాల్ పోస్టర్లు, బ్యానర్లు, మొదలగునవి ఎన్నికల నిబంధన వేరకు తొలగించాలన్నారు. నియోజకవర్గం కేంద్రాలలో ఆర్.ఓ కార్యాలయాలకు అవసరమైన మరమ్మతులు, రిపేర్లు, టాయిలెట్స్ వంటి మౌళిక సదుపాయాల పనులు చేయాలని సంబంధిత శాఖల ఇంజనీర్లను, అధికారులను కోరారు.

ఈ సమావేశంలో సిపిఓ బాలశౌరి, అర్&బి ఈ ఈ నరేందర్ రెడ్డి,అర్. డ బ్ల్యు.ఎస్. ఈ ఈ.ముజీబుద్దిన్, పి.అర్.ఎస్.ఈ., తిరుపతయ్య, మున్సిపల్ కమిషనర్లు,, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking