అయిల్ ఫామ్ సాగుతూనే
రైతులకు అధిక లాభాలు
ఆయిల్ ఫామ్ పరిశోధన సంస్థ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ బి ఎన్ రావు మద్దూరు అక్షిత న్యూస్:
మద్దూరు మండలములోనీ వల్లంపట్ల గ్రామానికీ చెందిన పోగుల గౌరయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ పంట సాగుపై అవగహన మరియు ఆయిల్ పామ్ సాగులో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తల గురించి రైతులకు అవగాహణ కల్పించేందుకు ముఖ్య అతిథిగా ఉద్యానశాఖలో ఆయిల్ పామ్ కన్సల్టెంట్ జాతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ రిటైర్ శాస్త్రవేత్త డాక్టర్ బి ఎన్ రావు పాల్గోని మాట్లాడుతూ ఆయిల్ పాము పంట ద్వారా రైతులకు అధిక లాభాలు పొందవచ్చు అలాగే మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలు వేసుకొని అదనపు ఆదాయం కూడా పొందవచ్చు అని ఒకసారి మొక్క నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తూ రైతులకు సుస్థిర ఆదాయం పొందవచ్చు అలాగే రైతులకు ఆయిల్ పామ్ పంట సాగులో తెగుళ్ల నివారణ సస్యరక్షణ చర్యలు గురించి వివరించారు మండల వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు చేయుటకు ఆసక్తిగల రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి పండరి ఆయిల్ ఫామ్ డిస్ట్ కో ఆర్డినేటర్ శంకర్ అగ్రికల్చర్ ఆఫీసర్ రామకృష్ణ ఏ ఈ ఓ రాకేష్ రాధిక అఖిల్ కల్పన అనూష ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ అనిల్, రైతులు పాల్గొన్నారు.