ఈటెల రాజేందర్ ను కలిసిన డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్ ! !

ఈటెల రాజేందర్ ను కలిసిన డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్

మద్దూరు అక్షిత న్యూస్:

బీజేపీ తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీ ఈటెల రాజేందర్ ను బుదవారం శామీర్పేట్ తన నివాసంలో ఉస్మానియా ఉద్యమకారుడు,బీసీ నాయకుడు డాక్టర్.బొంగోని సురేష్ గౌడ్ జనగామ నియోజకవర్గానికి చెందిన దాదాపు వంద మంది బీజేపీ కార్యకర్తలతో కలిసినట్లు సురేష్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో అనేక ఉద్యమాలు చేసి ఏబీవీపీ నుండి విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ కల్గిన కార్యకర్త గా అనేక ఉద్యమాలు చేసి జైలు జీవితం అనుభవించి తన కుటుంబాన్ని సైతం వదిలి తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగిందన్నారు.బీజేపీ లో కూడా యువకుల కోసం నిరుద్యోగుల కోసం ధర్నాలు ర్యాలీ లు రాస్తారోకోలు చేసి ఎన్నో కేసులు పాలు అయినా యువనాయకునికి టికెట్ ఇవ్వాలని అభ్యరించడం జరిగిందన్నారు.
దానికి ఈటెల రాజేందర్ సానుకూలంగా స్పందించండి జరిగింది.
ఈ సందర్భంగా జనగామ యువత ఈటెల రాజేందర్ కు ధన్యవాదాలు తెలుపుతూ బొంగోని సురేష్ గౌడ్ టికెట్ కేటాయిస్తే మొక్కవోని దీక్షతో గెలుపే లక్ష్యంగా పని చేసి కబ్జాల చేర్యాలకు విముక్తి కలిపించి.. అభివృద్ధి పథంలో నడిపించేలా చేస్తామని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నర్రా మహేందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, సురేందర్ మరియు నియోజకవర్గం నుండి తదితరులు కలిశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking