బుగ్గబావిగూడెంలో
బతుకమ్మ సంబరాలు
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
మండలంలోని బుగ్గబావిగూడెం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్ లలో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పకృతి ప్రసాదించిన తీరోక్క పూలతో బతుకమ్మను అలంకరించి ఆట పాటలతో అలరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారదా అంగన్వాడీటీచర్ రజిత, రోజా, ఎఎన్ఎం శైలజ ఆశ లక్ష్మి తల్లులు సంధ్య సరిత స్వరూప సైదమ్మ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.