తుర్కయంజాల్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం.
6 గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తున్న కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్.
రంగారెడ్డి అక్షిత ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ 21వ వార్డులో రెండవ రోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా గురువారం రోజున శ్రీ శ్రీ ఎంక్లేవ్ లో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించిన స్థానిక కౌన్సిలర్, తుర్కయంజాల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రచార కమిటీ సభ్యులు కొత్తకుర్మ శివకుమార్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుడ్ల అర్జున్, మున్సిపల్ ఉపాధ్యక్షులు గిరిధర్, ఎస్.సి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్క కిషన్, ఉపాధ్యక్షులు లక్ష్మి పతి, రవి కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.