ఎన్ పి ఎస్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు
చేర్యాల,అక్టోబర్ 12 అక్షిత ప్రతినిధి:
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు, గురువారం చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఉన్నత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కర్రోళ్ల విజయ్ కుమార్, ఉపాధ్యాయులు బాలమల్లు, విద్యార్థులు, మరియు విద్యార్థుల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.