*సపాయి అన్న నీకు సలాం*!
*తుర్కయంజాల్, అక్షిత ప్రతినిధి :
సపాయి అన్న నీకు సలాం!
సపాయమ్మ మీకు వందనం అను రీతిలో కలదు , పారిశుద్ధ్య కార్మికుల గుణం . తుర్కయంజాల్ పురపాలక సంఘ పరిధిలో పనిచేయుచున్న కార్మికులు ఎంతో నిజాయితీతో తమ పనిని చేసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈనెల తొమ్మిదిన తుర్కయంజాల్ పురపాలక సంఘ కార్యాలయంలో తమ అధికారి అయిన ప్రవీణ్ కుమార్ పై 11 వ వార్డు కౌన్సిలర్ భర్త దాడి చేస్తే కార్మికులంతా అందరూ ఐక్యమత్యమై నిరసన తెలిపారు. రెండో రోజు మరియు మూడో రోజు భోజన విరామ సమయంలో పది నిమిషాల నిరసన తెలిపి తమ పనిని తాను చేసుకున్నారు. నిజాయితీ గల అధికారిపై ,రోజు ప్రజల కోసం కష్టపడే తన అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు పురపాలక సంఘం అంతా తిరిగి శుభ్రత, ప్రజల సమస్యలను తీరుస్తూ స్వచ్ఛ సర్వేక్షన్ లో అవార్డు తెచ్చి ఢిల్లీ దాకా తుర్కయంజాల్ మున్సిపల్ ని తీసుకెళ్లడానికి కొనియాడారు . పారిశుద్ధ కార్మికులకు ఉన్న నిజాయితీ నిబద్ధత ప్రజా ప్రతినిధులకు లేదని పురపాలక పరిధిలోని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.