కదిలిన కాంగ్రెస్ దండు

కిక్కిరిసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

– తొలుత మల్లన్న గుట్ట పై స్వామి వారి దర్శనం..

– పలు గ్రామాల నుంచి కాంగ్రెస్ లో భారీగా చేరికలు…

– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వేముల..

– నూతన ఉత్సాహంలో కాంగ్రెస్ శ్రేణులు…

– అత్యధిక మెజార్టీనే లక్ష్యం…

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

కాంగ్రెస్ పార్టీలోకి వేముల వీరేశం రాకతో పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహం పెరిగింది. గురువారం రామన్నపేట మండల కేంద్రంలో గల జేపీ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నకిరేకల్ నియోజకవర్గం, మాజీ శాసన సభ్యులు వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎమ్మెల్యే అభ్యర్ధిగా పార్టీ అభ్యర్థిత్వాన్ని పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్వర్యంలో ఖరారు చేసుకుని, రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా మడలంలోని నిధానపల్లి గ్రామంలోని చిన్న శ్రీశైలం గా పేరు గాంచిన మల్లన్న స్వామిని దర్శించుకుని, సభ స్థలానికి చేరుకున్నారు. వివిధ గ్రామాల నుంచి వివిధ పార్టీల నుండి వేముల వీరేశం ఆధ్వర్యంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మండల పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ… వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరడం కార్యకర్తలకు నూతన ఉత్సాహం వచ్చిందని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి, అత్యధిక మెజార్టీ తో గెలిపించుకుంటామని తెలిపారు.

నియోజకవ్గంలోని అన్ని మండలాల కంటే అత్యధిక మెజార్టీ ఇచ్చే మండలం రామన్నపేట అని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, వేముల వీరేశం అభిమానులు కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఓటు బ్యాంక్ గా మారి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
*వేముల వీరేశం మాట్లాడుతూ…..*
నా అభ్యర్దిత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ… నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి, అత్యధిక మెజార్టీ కోసం అందరూ ముందుండాలని, ముందుగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అపద వచ్చిన నేను ఉన్న అనే బరోసా ఇస్తున్నానని, ఎవరు అదర్య పడొద్దని సూచించారు. నాతో వచ్చిన నాయకులు, కార్యకర్తల కంటే ముందు నుండి ఉండే నాయకులు, కార్యకర్తలకే ముందు అన్ని ప్రాధాన్యత ఉంటుందని, అన్ని చోట్ల లాగా వెంట వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి, ముందువారిని పక్కకి పెట్టే ఆలోచన ఉండదనీ, అందరికీ సముచిత స్థానం కల్పిస్తానని, నేను పార్టీలో చేరిన రోజునే అక్కడ కూడా ఇదే హామీ ఇచ్చి పార్టీలో చేరానని, ఎప్పుడు ఏ అపద ఉన్న తలుపు తట్టితే నేను రావడానికి సిద్దం అని తెలియజేశారు. అన్ని గ్రామాల నుండి చాలా మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఇంకా రాలేదు. అందరికీ ఇక్కడ జరిగే ప్రతి విషయం తెలియజేయాలి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ సముద్రం అని, ఇక్కడ ఎవరికైనా పోటీ చేసే అధికారం ఉన్నదని, ఎవరు పోటీ చేసిన అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ పని చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర, రామన్నపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మిర్యాల మల్లేశం, సీనియర్ నాయకులు అయిటిపాముల శేఖర్, రామేశ్వరం, మారుపల్లి మల్లారెడ్డి, గంగుల వెంకట రాజిరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు మేడి శోభారాణి, కొత్తగూడెం సర్పంచ్ చిల్లర కైలాసం, రామన్నపేట ఎంపీటీసీ ఎండి రేహాన్, దుబ్బాక ఎంపీటీసీ మడూరి జ్యోతి, మాజీ సర్పంచులు దేవి రెడ్డి సావిత్రమ్మ, గుండాల నరసింహ, ఆకవరపు మధుబాబు, పూస బాల నరసింహ, నాయకులు సింగనబోయిన జంగయ్య యాదవ్, జెల్లా వెంకటేశం, అయ్యాడపు నర్సిరెడ్డి, గోదాసు పృథ్వీరాజ్, అక్రమ్, జెల్లా వెంకటేశం, సాల్వరు లింగం, ప్రవీణ్, గోగు హరిప్రసాద్, కొండ శేఖర్ గౌడ్, కడారి శ్రీను, చిన్న లచ్చి చంద్రయ్య, వివిధ గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking