విద్యుత్ లైన్ జంపర్ కలుపుతుండగా ప్రమాదం
శనార్తి తెలంగాణ/నేరేడుచర్ల:
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన నేరేడుచర్ల మండలంలోని ఫత్తేపరం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది,ఎస్ ఐ పీ.పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మచ్చ కృష్ణ (38) గ్రామపంచాయతీ కరెంట్ హెల్పర్ గా విధులు నిర్వహిస్తున్నాడని,గురువారం పత్తేపురం మేడారం గ్రామ శివారులో గల మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో 11కెవి విద్యుత్ స్తంభం ఎక్కి జంపర్ కలుపుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై మృతి చెందాడని, విషయం తెలుసుకుని ఘటన స్థలానన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడుకి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.