మీట్-ది-ప్రెస్ -కేటీఆర్ తో టీయూడబ్ల్యూజే

కేటీఆర్ తో టీయూడబ్ల్యూజే
మీట్-ది-ప్రెస్ హాజరైన జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

2023 శాసన సభ ఎన్నికలను పురస్కరించుకొని ఆయా ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య బాధ్యులతో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మీట్-ది-ప్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవ్వాళ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి, భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్వాగత సందేశం ఇవ్వగా, ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్ర, జాతీయ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు దాదాపు 130మంది హాజరయ్యారు. గడిచిన పదేళ్ళలో తమ ప్రభుత్వం చేపట్టిన ఆయా సంక్షేమ చర్యలు, భవిష్యత్తులో చేప్పట్టే కార్యక్రమాల్ని ముందుగా కేటీఆర్ వివరించారు. అనంతరం జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎం.ఏ.మాజీద్, జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, హెచ్.యు.జె అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, షౌకత్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking