వాట్సాప్ లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి
హుజూర్నగర్ రూరల్ అక్షిత న్యూస్
హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామంలో వాట్సాప్ గ్రూప్ లో వివిధ రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కు విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపకురాలు చీకురీ లీలావతి కోరారు ఇలాంటి పోస్టుల వల్ల గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని గొడవ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని ఆమె అన్నారు