మల్లాపూర్ డివిజన్ ఇంటింటి ప్రచారం
తార్నాక, అక్షిత ప్రతినిధి(మల్లాపూర్ ):
ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కొరకు మల్లాపూర్ డివిజన్ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు, స్థానిక కాలనీల్లో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ, న్యూ భవాని నగర్ కాలనీల్లో నిర్వహించడం జరిగింది.ఇట్టి పాదయాత్ర కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో పాటు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాళ్లు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు, స్థానిక కాలనీ అభివృద్ధి పనుల తెలుపుతూ ప్రచారం చేశారు.