ప్రగతి ప్రదాతకు పట్టం కట్టండి
బిఆర్ఎస్ నేత నల్లమోతు సిద్ధార్థ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నల్లమోతు భాస్కర్ రావును మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ యువ నేత నల్లమోతు సిద్ధార్థ కోరారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం, భాగ్యనగర్ కాలనీలలో స్థానిక కౌన్సిలర్ తిరుమలగిరి స్వర్ణలత వజ్రం, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి పట్టణ ప్రగతి, బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను కరపత్రాలు పంపిణీ చేశారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.