క్రీస్తు బోధనలు అనుసరణీయం

క్రీస్తు బోధనలు అనుసరణీయం

క్రిస్మస్ కానుకలు పంపిణీ
ఆర్డీఓ చెన్నయ్య
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
క్రిస్మస్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని మిర్యాలగూడ ఆర్డీఓ బి.చెన్నయ్య అన్నారు.
మిర్యాలగూడ పట్టణంలో స్థానిక ఏఆర్సి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలను, ప్రభుత్వ క్రిస్మస్ కానుకల పంపిణీ నిర్వహించారు. ఆర్డీఓ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన క్రైస్తవ మత పెద్దలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీస్తు బోధనలు, పాటలతో వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు.

అనంతరం క్రైస్తవులకు ప్రభుత్వం అందించే కానుకలను అందజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1000 కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణం, మండలంలో 600కిట్లు, దామరచర్ల మండలానికి 120, అడవిదేవులపల్లి మండలానికి 80, మాడుగుల పల్లి మండలానికి 100, వేములపల్లి మండలానికి 100 కిట్లను అందించనున్నట్లు ఆర్డీఓ బి.చెన్నయ్య తెలిపారు.

కార్యక్రమంలో తహసీల్దార్ హరిబాబు, జడ్పిటిసిలు తిప్పన విజయసింహారెడ్డి, ఆంగోత్ లలిత, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, దామరచర్ల ఎంపిపి ధీరావత్ నందిని, కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు దోసపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking