ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకోవాలి..ఆర్డీఓ సూర్యనారాయణ,పట్టణ ప్రజా ప్రతినిధులు
పేద క్రైస్తవులకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులు పంపిణీ
కోదాడ అక్షిత ప్రతినిధి :
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డీవో ఆర్ సూర్యనారాయణ అన్నారు. శనివారం కోదాడ తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో కోదాడ పట్టణ పేద క్రైస్తవులకు ప్రభుత్వం సఫరా చేసిన దుస్తులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వెయ్యి మంది పేద క్రైస్తవులకు ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సాయి గౌడ, జడ్పిటిసి శేషు కుమారి, వైస్ ఎంపీపీ మల్లెల రాణి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్ సిసిఓసి కమిటీ ప్రెసిడెంట్ జోసఫ్ రాజు, టౌన్ కమిటీ సెక్రటరీ సురేష్ ప్రభుదాస్ పాల్చారి, దానియేలు ఆమోస్ అబ్రహం,యోషయా, కౌన్సిలర్లు సామినేని ప్రమీల, గంధం యాదగిరి షాబుద్దీన్, ప్రసన్న కోటిరెడ్డి, కర్రీశివ సుబ్బారావు, కమదన చందర్రావు లబ్ధిదారులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.