గణిత వెలుగులు నింపిన బాల మేధావి

గణిత వెలుగులు నింపిన బాల మేధావి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్
ఎస్ ఆర్ డి జి పాఠశాలలో మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్
శ్రీనివాస రామానుజన్ అయ్యార్ 19వ శతాబ్దపు ప్రఖ్యాత గణిత మేధావులు యూలర్, జాకోవిచ్, లాంటి శాస్త్రజ్ఞుల సరసన ప్రపంచ గణిత వేదికలో గణిత వెలుగులు నింపిన బాల మేధావిగా రామానుజన్ అయ్యర్ గణిత శాస్త్ర చరిత్రలో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నారు. సాంప్రదాయ పాఠశాల విద్య లేనప్పటికీ తన 12 ఏటనే త్రికోణమితి సిద్ధాంతాలను ప్రతిపాదించిన అత్యంత ప్రతిభగల బాల మేధావిగా రామానుజన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. స్థానిక ఎస్ ఆర్ డి జి పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని మాథ్స్ డే ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పుట్టల శ్రీనివాస్, రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గణితం పట్ల భయం వీడి, గణితంలోని భావనలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని సాధనతో చేస్తే గణితంలో అత్యధిక మార్కులు సాధించవచ్చు.

గణితంను కష్టంగా కాకుండా, ఇష్టంగా సాధన చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా విద్యార్థులు గణిత ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking