ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి..!
-జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి…!!
జనగామ, అక్షిత ప్రతినిధి:
జనగామ జిల్లా జనగామ నియోజకవర్గంలోని ప్రజలందరూ
స్వామివారి దయతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఆకాంక్షించారు.వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని బాణాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. దేవాలయ ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు.. నియోజకవర్గ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు..రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతుందన్నారు..ఈ పర్వదినం ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత అని పేర్కొన్నారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆశీర్వాదం ఇచ్చారు.. అనంతరం ఆలయ అర్చకులు పల్లా రాజేశ్వర్ రెడ్డిని శాలువాతో సత్కారించారు…