కోదాడ కోర్టు ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

కోదాడ కోర్టు ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

సీసీ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యంగా చేపట్టాలి

కోదాడ, అక్షిత ప్రతినిధి :

కోదాడ కోర్టు ఆవరణలో జిల్లా కలెక్టరేట్ నుండి మంజూరైన సుమారు పది లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్, జూనియర్ సివిల్ అడిషనల్ జడ్జ్ భవ్య శ్రీ లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణ పనులను గుత్తేదారులు నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు. కోదాడ కోర్టుల అభివృద్ధికి నిధులు మంజూరు కావడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ సీనియర్ న్యాయవాది చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవబత్తిని నాగార్జున, ఉపాధ్యక్షులు గాలి శ్రీనివాస్ నాయుడు, ప్రధాన కార్యదర్శి సాధువు శరత్ బాబు, కోశాధికారి పాషా, బార్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking