కోదాడలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
కోదాడ, అక్షిత ప్రతినిధి :
కోదాడలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో బస్టాండ్ సెంటర్ లో ట్రాఫిక్ పరిశీలించి మాట్లాడారు. అనంతగిరి రోడ్డులో ట్రాఫిక్ సమస్య ను విలేకరులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బంది అప్రమంతంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధీకరణ త్వరలో చేపడతామన్నారు .అనంతరం కోదాడలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకును పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన పెట్రోలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రకాష్ సీఐ రాము సిబ్బంది పాల్గొన్నారు