సంఘం పటిష్ఠతకు కృషి

సంఘం పటిష్ఠతకు కృషి
కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు నవీన్ కుమార్

కరీంనగర్, అక్షిత ప్రతినిధి : ఆర్య వైశ్య మహాసభ పటిష్టతకు కృషి చేస్తానని కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ అన్నారు. శనివారం నియామక పత్రo అందుకున్న తదుపరి విలేకరులతో మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘం పటిష్ఠతకు తమ వంతు కృషి చేస్తానని చెప్పారు. సంఘ పటిష్టత కోసం, అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమంల్లో తన సంపూర్ణ సహాకారం అందించి, ఆర్యవైశ్య జాతికి సామాజికంగా, రాజకీయంగా పెంపొందించుటకు కృషి చేస్తానని నవీన్ కుమార్ తెలిపారు. కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా దేవిశెట్టి నవీన్ కుమార్ నియామకం జరిగింది. ఈ మేరకు పట్టణ అధ్యక్షులు నగునూరి రాజేందర్ నియామక పత్రాన్ని నవీన్ కుమార్ కు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్ది వేణుగోపాల్, కోశాధికారి సుద్దాల వెంకటేష్, సంఘ సభ్యులు కొల్లిపాక శ్రీనివాస్, ఎల్లంకి సంతోష్ చిట్టి మల్ల ప్రశాంత్, పైడా రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking