నామినేషన్ దాఖలు చేసిన విఠల్ ప్యానెల్
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
ఫిబ్రవరి 4న హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఆదివారం మనోళ్ళ విఠల్ తన ప్యానల్ అభ్యర్థులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు . ఈ సందర్భంగా నామినేషన్లు స్వీకరించిన ఎన్నికల అధికారులు రాములు ,ఏక్ నాథ్ దూన్గే,టైల్స్ శ్రీను లు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం బస్తి వాసులు విఠల్ కార్యాలయం వద్ద బాణాసంచా పేలుస్తూ తమ మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో నాయకులు టి.నరసింహులు,ఎర్రన్న,మల్లేష్ యాదవ్,నరసింహ చారి,రామ్ రెడ్డి,నరసింహారెడ్డి, అప్పారావు,లోహిత్,సతీష్,శంకర్ సింగ్,బంగారయ్య,తదితరులు పాల్గొన్నారు