ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
– గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు
– విద్యుత్ సిబ్బందికి ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ కాపీలు అందజేయండి
– నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు
– కూనూరు సాయి కుమార్ గౌడ్
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయడం జరుగుతుందని, నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కునూరు సాయి కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్తు అధికారులే నేరుగా లబ్దిదారుల ఇంటికి వచ్చి ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను సేకరిస్తారని తెలిపారు.