కోదాడలో సిటీ యూనియన్ బ్యాంక్ సేవలు ప్రారంభం

కోదాడలో సిటీ యూనియన్ బ్యాంక్ సేవలు ప్రారంభం

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలి

కోదాడ, అక్షిత ప్రతినిధి :

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి వారి నమ్మకం, మన్ననలు పొందాలని కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్థి.సుబ్బారావు వర్తక సంఘం అధ్యక్షులు గాదంశెట్టి. శ్రీనివాసరావులు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ యూనియన్ బ్యాంకు 777 వ శాఖ ను సంస్థ చీఫ్ మేనేజర్ మోహన సుందరం, తెలంగాణ రీజనల్ మేనేజర్ నరేష్ లతో కలిసి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించి మాట్లాడారు.

గత 12 దశాబ్దాల నుండి దేశవ్యాప్తంగా 777 శాఖలను కలిగిన సిటీ యూనియన్ బ్యాంక్ ప్రజలకు నమ్మకమైన సేవలు అందించడం అభినందనీయం అన్నారు.  సిటీ యూనియన్ బ్యాంకు లో తక్కువ వడ్డీతో విద్యా, వ్యాపార, బంగారం,గృహ, వాహన,వ్యవసాయ, అనుబంధ రంగాలకు  చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించుకొని ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా డిపాజిట్లపై ఖాతాదారులకు అధిక వడ్డీని ఇస్తున్నామని ఇట్టి అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ బ్రాంచ్ మేనేజర్ సత్య కుమార్, ఖమ్మం సీనియర్ మేనేజర్. రమేష్, విజయ్ కుమార్, సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ సందీప్ కుమార్, నల్గొండ మేనేజర్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking